మంత్రాలయంలో  కళ్యాణ కట్ట టెండర్ రద్దుకు  అధికారులు  నోటీసులు  జారీ  చేశారు.  కళ్యాణకట్టలో  భక్తుల నుండి  అదనంగా డబ్బులు వసూలు  చేస్తున్నారనే విషయమై  నోటీసులు  జారీ చేశారు. 

కర్నూల్: మంత్రాలయం దేవాలయంలో కళ్యాణ కట్ట టెండర్ ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 
తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అదరంగా రూ. 100 వసూలు చేస్తున్నారని 

కళ్యాణ కట్ట తలనీలాలు సమర్పించే భక్తుల నుండి రూ. 20 టోకెన్ తో పాటు అదనంగా రూ. 100 వసూలు చేస్తున్నారు.టోకేన్ తో కళ్యాణ కట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించే సమయంలో క్షురకులు భక్తుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఫిర్యాదులు చేశారు. సగం జుట్టు కత్తిరించిన తర్వాత అదనంగా డబ్బులు వసూలు కు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్షురకుల డిమాండ్ కారణంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెండర్ రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులను జారీ చేశారు అధికారులు.