మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజీ విభేదాలు : అక్కినేని మణిపై గూండాల దాడి... పీఎస్ లో కేసు ! (వీడియో)
గుంటూరు : మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజీ లో డైరెక్టర్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై కొంతమంది దాడి చేశారంటూ నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి చెందిన అక్కినేని మణి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు : మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజీ లో డైరెక్టర్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై కొంతమంది దాడి చేశారంటూ నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి చెందిన అక్కినేని మణి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్ఆర్ఐ హాస్పిటల్ లోని తాను ఉంటున్న ప్లాటును ఖాళీ చేయాలని కొంతమంది తనను బెదిరించారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తనపై దాడి వెనుక ముక్కామల అప్పారావు, సోము కృష్ణ మూర్తి , కోనేరు శ్రీధర్ ఉన్నారని ఫిర్యాదులో అక్కినేని మణి పేర్కొన్నారు.
అక్కినేని మణికి మద్దతుగా తెలుగుదేశం నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా అక్కినేని మణి , ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు బయల్దేరారు.
NRI హాస్పిటల్ ఆవరణలోని క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న డైరెక్టర్ మణి అక్కినేని ఇంటిపై కొంతమంది దాడిచేసి సామాన్లు బయట విసిరేయటంతో ఆసుపత్రి డైరెక్టర్ మణి అక్కినేని రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడిలో ఇరవైమంది గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారని దీనివెనుక కోనేటి శ్రీధర్ హస్తం ఉందని మణి అక్కినేని వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ.. ‘ఎన్ఆర్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న నా అపార్టమెంట్ లోకి ఈ రోజు, సుమారు 20 - 30 మంది గూండాలు బలవంతంగా ప్రవేశించారు.నేను వెంటనే అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయకపోతే నన్ను చంపేస్తానని గూండాలు బెదిరించారు. వారితో వాగ్వాదం తరువాత కోనరు శ్రీధర్, విజయవాడ న్యాయవాదిసోము కృష్ణమూర్తి, ముక్కమల అప్పారావుల సూచనల మేరకు ఈ కంప్టైంట్ చేస్తున్నాను.
అక్కడినుంచి నన్ను బలవంతంగా ఖాళీ చేయించాలని, అవసరమైతే నాపై దాడి చేయమని వారికి సమాచారం ఉన్నట్టుగా తెలిసింది. 30మంది గూండాల్లో నలుగురి నాపై దాడి చేశారు. గాయాలు అయ్యాయి. నన్ను నేలమీదకు నెట్టి, బలవంతంగా నా అపార్ట్మెంట్ నుండి బయటకు లాక్కొచ్చారు.
నా అపార్ట్‌మెంట్‌లోని వస్తువులు, సామాగ్రి దెబ్బతిన్నాయి. ఈలోగా, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ప్రైవేట్ సెక్యూరిటీ నన్ను రక్షించడానికి ప్రయత్నించగా, గూండాలు వారిని కూడా కొట్టారు. ఇది ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ ప్రాంగణంలో శాంతిభద్రతల ఉల్లంఘనకు నిదర్శనం.
"
ఇది కోవిడ్ ఆసుపత్రి, నేను సీనియర్ గైనకాలజిస్ట్, 74 సంవత్సరాల వయస్సు, నేను ఆసుపత్రిలో రోగుల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాను. ఎన్నారై సొసైటీలో సభ్యురాలిని, ఇటీవల, ముక్కమల అప్పా రావు, కోనే శ్రీధర్, సోము కృష్ణమూర్తి సొసైటీలో విభేదాలను సృష్టించారు, హాస్పిటల్, మెడికల్ కాలేజీలో వారి ఆర్థిక మోసాలను కప్పిపుచ్చడానికి మాలో విభేధాలు సృష్టించారు.
నేను వారి ఆర్థికమోసాలను ప్రశ్నించానని నన్ను టార్గెట్ చేశారు. ఇటీవలే వారు నా మీద 2,3 ఫిర్యాదులు కూడా చేశారు. దీని కోసం నేను ఎ.పి హైకోర్టును ఆశ్రయించాను. పోలీసులు నన్ను అరెస్టు చేయకూడదని చెప్పి నాకు ఉపశమనం కలిగించింది. ఎన్‌ఆర్‌ఐ క్యాంపస్‌లో ఉన్న గూండాలపై చర్యలు తీసుకోవాలని, నా అపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి రావడానికి నాకు రక్షణ కల్పించాలని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను అభ్యర్థిస్తున్నాను’ అంటూ లెటర్ లో రాసుకొచ్చారు.