అమరావతి:  ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో  వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణకు ఆదేశించింది వ్యవసాయ శాఖ.

ఏపీ సీడ్స్ ద్వారా మంజీర విత్తనాలను  మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కొనుగోలు చేశాడు. 14 ఎకరాల్లో ఈ విత్తనాలను వేశారు. అయితే ఐదు ఎకరాల్లో మొలకలు లేని విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే గుర్తించారు.

ఈ విషయమై ఎమ్మెల్యే ఆర్కే వ్యవసాయ శాఖాధికారులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ విచారణ చేస్తున్నారు.

నకిలీ విత్తనాలతో పలువురు రైతులు మోసపోతున్న విషయం తెలుగు రాష్ట్రాల్లో రోజు ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం. కానీ తాజాగా నకిలీ విత్తనాల బారిన ఎమ్మెల్యే పడడం ప్రాధాన్యత సంతరించుకొంది. నకిలీ విత్తనాలు తయారు చేసిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

నకిలీ విత్తనాల బారిన రైతులు పడేవారు. తాజాగా ఎమ్మెల్యే కూడ నకిలీ విత్తనాల బారినపడడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ సీరియస్ గా తీసుకొంది. నకిలీ విత్తనాలు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో విక్రయించారనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు.