అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం టిడిపి కంచుకోట. 2008 లొ జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మండపేట అసెంబ్లీ ఏర్పాటయ్యింది. ఇక్కడ ఇప్పటివరకు మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు టిపిదే విజయం. వైసిపి ఇక్కడ ఖాతాకూడా తెరవలేదు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేటలో పట్టు నిలుపుకోవాలని టిడిపి... జెండా ఎగరేయాలని వైసిపి పట్టుదలతో వున్నాయి. ఈ నేపథ్యంలో మండపేట ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

మండపేట రాజకీయాలు : 

తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. గత పదిహేనేళ్లుగా మండపేట ఎమ్మెల్యేగా వి.జోగేశ్వరరావు కొనసాగుతున్నారు. మండపేట అసెంబ్లీ ఏర్పాటుతర్వాత 2009 లో మొదటిసారి ఎన్నికలు జరగ్గా టిడిపి విజయం సాధించింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా టిడిపి గెలిచింది. 2019 లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా కొనసాగినా మండపేటలో మాత్రం టిడిపి విజయంసాధించి హ్యాట్రిక్ కొట్టింది. 

మండపేటలో టిడిపి బలంగా వుండటంతో ఈసారి బలమైన నేతను బరిలోకి దింపేందుకు వైసిపి సిద్దమయ్యింది. ఇందులోభాగంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంచార్జీగా నియమించింది. ఆయనే ఈసారి జోగేశ్వరరావుపై పోటీకి దింపాలన్నది వైసిపి ఎత్తుగడగా తెలుస్తోంది. 

మండపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. రాయవరం 
2. మండపేట 
3. కపిలేశ్వరపురం

మండపేట నియోజకవర్గ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,14,301 

పురుషులు - 1,04,913

మహిళలు ‌- 1,09,473

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మండపేటలో వైసిపికి ఇప్పటివరకు గెలుపన్నదే లేదు. దీంతో ఈసారి ఎలాగైన గెలిచితీరాలని భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును బరిలోకి దింపుతోంది. అయనే ప్రస్తుతం మండపేట ఇంచార్జీ.

టిడిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వి. జోగేశ్వరరావునే మరోసారి బరిలోకి దింపుతోంది వైసిపి. వరుసగా మూడుసార్లు మండపేటలో విజయం సాధించిన జోగేశ్వరరావు నాలుగోసారి పోటీలో నిలిచారు. 

మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,80,631 (96 శాతం)

టిడిపి - వేగుళ్ళ జోగేశ్వరరావు - 78,029 (41 శాతం) - 10,600 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - పిల్లి సుభాష్ చంద్రబోస్ - 67,429 (36 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - లీలా కృష్ణ ‌- 35,173 (18 శాతం)

మండపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,71,609 (87 శాతం)

టిడిపి - వి జోగేశ్వరరావు - 68,104 (43 శాతం) ‌- 17,440 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - జివి స్వామినాయుడు - 64,099 (37 శాతం) - ఓటమి