Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రచ్చ: సమావేశమైన హై పవర్ కమిటీ

అమరావతి సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ సమావేశం మంగళవారం నాడు విజయవాడలో సమావేశమైంది. 

minister buggana rajendranath reddy conducts High power committee meeting in vijayawada
Author
Amaravathi, First Published Jan 7, 2020, 5:11 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన హైపవర్ కమిటీ  మంగళవారం నాడు విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం ఇదే.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది హై పవర్ కమిటీ.. ఈ హై పవర్ కమిటీ ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయనుంది.

Also read:పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

ఈ నెల 20వ తేదీలోపుగా  హైలెవల్ కమిటీ  రిపోర్టును ఇవ్వనుంది.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో   రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు 22 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 

Also read:రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

హైపవర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలను సీఎం జగన్‌కు నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. రెండు కమిటీలు కూడ పరిపాలన వికేంద్రీకరణకు మొగ్గు చూపాయి.

also readజగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..

హైవపర్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే  కమిటీ సభ్యలను కలిసేందుకు ప్రయత్నించారు. కమిటీని కలిసేందుకు లాయర్లకు అనుమతి ఇవ్వలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios