అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్ లో ఓ చిన్నారిని కుటుంబసబ్యుల కళ్లుగప్పి కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బస్టాండ్‌లోని ప్రయాణీకులు గుర్తించి కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కదిరి పట్టణంలో తాను వచ్చినప్పటి నుండి కిడ్నాపర్ వెంబడిస్తున్నాడని చిన్నారి తల్లి ఆరోపించింది. తన కూతురిని ఎత్తుకెళ్తున్న సమయంలో ప్రయాణికులు అడ్డుకొని తన బిడ్డ తనకు దక్కేలా చేశారని ఆమె చెప్పారు.