అక్రమ సంబంధం: భార్యకు గుండు కొట్టించి, ఊరేగించిన భర్త

Man suspects love affair; tonsures, parades wife
Highlights

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త, అతని తండ్రి దారుణానికి ఒడిగట్టారు.

నెల్లూరు: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త, అతని తండ్రి దారుణానికి ఒడిగట్టారు. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో చోటు చేసుకుంది.

నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై భాగ్యలక్ష్మి అనే బాధిత మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్ల తర్వాత ఆమెను భర్త వేధించడం ప్రారంభించాడు. గ్రామంలోని మరో వ్యక్తితో భాగ్యలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనివాసరావు, అతని తండ్రి అనుమానిస్తూ వచ్చారు. 

ప్రతి గుడికి తిప్పుతూ మరోసారి ఆ పని చేయనంటూ ఆమె చేత చెంపలేయించారు. ఎవరు కూడా ఆమెకు అండగా రాలేదు. పుట్టింటికి వెళ్లిపోవాలని వెంకయ్య ఆమెను ఆదేశించాడు. అయితే, బంధువులంతా ఒత్తిడి చేయడంతో తిరిగి రావడానికి వెంకయ్య అంగీకరించాడు. కానీ వేరే గదిలో ఉండాలని చెప్పాడు.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి భాగ్యలక్ష్మిని విచారించారు. ఫిర్యాదు ఇవ్వడానికి తొలుత ఆమె నిరాకరించింది. 

loader