తాడికొండ మండలం పొన్నెకల్లులో దారుణం జరిగింది. గుంటూరుకు చెందిన పచ్చిపులుసు గోపీ కృష్ణ అనే వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Add Asianetnews Telugu as a Preferred Source

"
గోపీకృష్ణ పొన్నెకల్లులోని దేశ్ ముఖ్ అనే బంధువు దగ్గర లక్షన్నర అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వకపోతుండడంతో దేశ్ ముఖ్ డబ్బుల కోసం ఒత్తిడి చేశాడు. బాకీ డబ్బులు అడుగున్నాడనే మనస్తాపంతో గోపీకృష్ణ ఈ పని చేశాడు.
అప్పు ఇచ్చిన దేశముఖ్ ఇంటి ఎదుటే గోపి కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంచెం కొంచెం ఇస్తాను నా పరిస్థితి బాలేదు అని చెప్పినా అతను ఒప్పుకోలేదు. మొత్తం ఒకేసారి కావాలనడంతో ఏం చేయాలో అర్థం కాక చనిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.