వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. తాజాగా వారి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కుంతలగూడెనికి చెందిన గౌరు శ్రీను ఆర్ధిక అవసరాల కోసం ఓ వడ్డీ వ్యాపారి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి వేధింపులు ఎక్కువ కావడంతో శ్రీను మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన ఆవేదనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి షేర్ చేశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.