కట్టుకున్న భర్త.. భార్యను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను బజారున పెట్టాడు. డబ్బు, నగల కోసం కక్కుర్తి పడి.. భార్య పట్ల అతి దారుణంగా ప్రవర్తించాడు. భార్యను నగ్నంగా వీడియో తీసి.. వాటిని వేలం వేశాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడకు చెందిన మహిళకు అప్పటికే వివాహమైంది. అయితే..  ఆమెను భర్త అతి దారుణంగా మోసం చేశాడు. దీంతో.. ఆ మోసాన్ని తట్టుకోలేక అతనికి దూరమైంది. అయితే.. ఆమె దగ్గర డబ్బు, నగదు ఉండటంతో.. ఆమెపై మరో వ్యక్తి కన్నేశాడు. ఆమె దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బు ఉన్నాయని ఊహించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆమెను నమ్మించాడు. భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి... ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

తరువాత శ్రీనివాసరెడ్డి మొదటి భార్య, అతని తల్లి, బావమరిది కలిసి రెండో భార్య స్నానం చేస్తున్న సమయంలో నగ్న వీడియోలు తీసి ఆమె శీలాన్ని రూ. 20 లక్షలకు వేలం పెట్టారు. అప్పటికే అరకిలో నగలు, రూ. 14 లక్షలు తీసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులివ్వడానికి రూ. 6 లక్షలు లూటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ... ఇప్పుడు నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చెయ్యడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.