ఇద్దరు స్నేహితుల మధ్య అక్రమ సంబంధం చిచ్చు రేపింది. ఒకరిని హతుడిగా, మరోకరిని హంతకుడిగా మార్చింది. తాడేపల్లిలో ఈ నెల 19న జరిగిన హత్య కేసులో హంతకుడు మృతుడి స్నేహితుడే అని పోలీసులు తేల్చారు. 

గుంటూరు : తాడేపల్లిలో ఈ నెల 19న జరిగిన murder కేసుని పోలీసులు చేదించారు. ఈ మేరకు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. illicit relationship హత్యకు కారణం అని తేల్చారు. tadepalligudem వడ్డేశ్వరంలో ఈనె 19వ తేదీన సాంబయ్య హత్యకు గురయ్యాడు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని, హంతకుడిని తంబీగా గుర్తించామని పోలీసులు గుర్తించారు.

మృతుడు సాంబయ్య, హంతకుడు తంబీ ఇద్దరూ స్నేహితులు. ఇరువురూ బెల్ధార్ మేస్త్రీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకస్త్రీతో‌ మృతుడికి, హతకుడికి గల సంబంధమే హత్యకు కారణం అని తేల్చారు. మృతుడు సాంబయ్యతో గతంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంబంధం నేపథ్యంలో తంబి హత్య‌ చేశాడని తెలిపారు. ఈ హత్యకు తంబి మరో ఇద్దరి సహాయం తీసుకున్నాడని, తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 

కాగా, గుంటూరు టౌన్ పరిధిలో దోపిడికి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. షేక్ ఆసీఫ్ మరి ఇదిరితో కలసి దోపిడీలకు పాల్పడ్డారు.తాగుడు, గంజాయి కి బానీసలుగా మారీ దొంగతనానికి పాల్పడ్డారు. వీరు ఊరు చివరిలో ఉన్న ఇళ్ళను, రోడ్డుపై వంటరిగా సంచరిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసారు. దార‌కాచి నగదు, వాహనాలు, సెల్ ఫోన్ లను దోచుకుంటారు. దోపిడి చేయగా వచ్చిన సొమ్ముతో గంజాయి కొని విక్రయిస్తారు. ఇప్పటివరకు వీరిపై ఎటువంటి‌ కేసు నమోదు కాలేదు.

ఇదిలా ఉండగా, నెల్లూరులో దారుణం జరిగింది. Hijraగా మారుస్తామని లింగ మార్పిడి చేసేందుకు మర్మాంగాన్ని తొలగించడంతో Severe bleeding అయి ఒక యువకుడు మృతి చెందాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో B Pharmacy విద్యార్థులు ఈ శస్త్రచికిత్స చేశారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా jarugumalli మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి శ్రీకాంత్ అలియాస్ అమూల్య (28) చిన్నతనం నుంచి హైదరాబాదులో తాపీ పని కి వెళ్ళేవాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తెతోపెళ్లి అయింది. ఆరు నెలలకే 2020లో భార్యతో విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఒంగోలులో ఉంటున్నాడు. 

అక్కడ ఆయనకు విశాఖకు చెందిన మోనాలిసా అలియాస్ అశోక్ తో పరిచయం అయింది. ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆరు నెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్న మస్తాన్, జీవ పరిచయమయ్యారు. వీరిద్దరితో సాన్నిహిత్యం పెరిగిన తరువాత తాను ముంబయికి వెళ్లి Gender reassignment శస్త్ర చికిత్స చేయించుకుంటానని మస్తాన్ కు శ్రీకాంత్ చెప్పాడు. అందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, తాను బీఫార్మసీ విద్యార్థినని.. శస్త్రచికిత్స పై అవగాహన ఉందని.. తక్కువ ఖర్చుతో తానే చేస్తానని హామీ ఇచ్చాడు.

దీంతో అందరూ కలిసి 23వ తేదీన నెల్లూరులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. మస్తాన్, జీవాలు.. monalisa సాయంతో శ్రీకాంత్ కు గురువారం శస్త్ర చికిత్స ప్రారంభించారు. మర్మాంగాన్ని తొలగించడంతో తీవ్ర రక్తస్రావమైంది. పల్స్ పడిపోవడం, మోతాదుకు మించి మందులు వాడడంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ మరణించాడు. దీంతో అక్కడి నుంచి పరారయ్యారు విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. 

మృతుడి వద్దనున్న ఆధారాలతో ఆయన అక్క పల్లవికి పోలీసులు సమాచారం అందించారు. మృత.దేహాన్ని జిజిహెచ్ మార్చురీకి తరలించారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.