ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. లోకం తెలియని ఆ పసికందుకు కర్కశంగా గొంతు నులిచి చంపేశాడు.
ఈ సంఘటన క్రిష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది. నాలుగు నెలల పసికందుకు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి గొంతునులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడి గట్టాడా? లేదా స్థల వివాదాలు కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రెడ్డిగూడెం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.