మతిస్థిమితం లేని మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... దర్శి మండలం తూర్పుచౌటపాలెంకు చెందిన మైనర్ బాలికకు మతిస్థిమితం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటి వద్ద ఉంచి ఆదివారం చర్చికి వెళ్లారు. 

ఇంటికి సమీపంలో నివసిస్తున్న రాచపూడి కోటయ్య (28), బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. పొరుగున ఉండే ఓ మహిళ గమనించి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఈమేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.