ఇంట్లో వారంతా పనుల కోసం బయటకు వెళ్లగా... ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన కె.మరియానందం(48) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి మూడేళ్ల కిందటే మరణించాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురు బిడ్డలను పోషిస్తోంది.

గురువారం మధ్యాహ్నం బాలిక ఇంట్లోవారంతా కూలి పనుల కోసం బయటకు వెళ్లగా.. చిన్నారి ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో.. బరియానందం బాలిక ఇంట్లో కి దూరి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి బాలిక అసలు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.