మసాజ్ పేరుతో వ్యభిచారంలోకి దింపి.. వాటిని ఫొటోలు తీసి వేధిస్తున్నారని.. తాను బతకలేనని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో కలకలం రేపింది.
విజయవాడ : Krishna Districtలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి Selfie video తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మసాజ్ పేరుతో Prostitution రొంపిలోకి దింపి, అసభ్యకరంగా ఉన్న ఫొటోలను బయట పెడతామంటూ Harassmentలకు గురి చేస్తున్న ముఠా కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలోని ఓ హోటల్ గదిలో మంగళవారం జరిగింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బెరవలి శ్రీకాంత్ రెడ్డి (30) ప్రైవేట్ ఉద్యోగి.
రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో అతడికి వివాహం అయ్యింది. శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగ విధుల్లో భాగంగా కొంతకాలంగా విజయవాడ వచ్చి పోతున్నాడు. ఈ క్రమంలో చైతన్య, సత్యకుమార్, సునీల్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరు శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల ఓ మసాజ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓ మహిళతో చనువుగా ఉండేలా చేశారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో వారి ఫొటోలు చిత్రీకరించిన ఆ ముగ్గరూ.. ఫొటోలు తొలగించాలంటే తమకు భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తడికి గురైన శ్రీకాంత్ రెడ్డి మంగళవారం బెంజి సర్కిల్ లోని ఓ హోటల్ లో గది తీసుకుని తన ఆవేదనంగా చెప్పుకుంటూ ఓ సెల్పీ వీడియో తీశాడు. ఆ తరువాత హోటల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగు చూసింది. ఆ ప్రేమకథ ప్రియుడి suicideతో విషాదాంతమైంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్ (31)గా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకోవడమే కాక... ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులు లేఖ రాసి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆయన ఉత్తరం రాయడం విశేషం. పోలీసుల కథనం మేరకు.. చిక్కమగళూరు జిల్లా shankarapuraకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాలు కోసం చేతనే డబ్బులు ఖర్చు చేసేవాడు. అలా ఆమె కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్నేహితులతో చెప్పి వాపోయేవాడు చేతన్.
సరకు రవాణా వాహనాలు నడుపుతూ జీవించే అతను తన ఆదాయంలో అధికభాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన చేతన్.. చివరికి జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతడి మృతదేహం వద్ద ఒక లేఖ లభించింది. అందులో నా ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
