చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని దారుణంగా చంపిన యువకుడు ఆపై తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. వేలూరు రోడ్డులోని కొండమిట్ట ప్రాంతంలో వున్న ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న ప్రశాంతి అనే యువతి దారుణహత్యకు గురైంది. చక్రవర్తి అనే యువకుడు ఆమె గొంతు కోసి అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొనఊపిరితో వున్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
