వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త నిత్యం మధ్యం తాగి వచ్చి భార్యను హించించేవాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి వేధిస్తుండటం తట్టుకోలేకపోయిన తండ్రి అల్లుడిపై కత్తితో దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

కర్నూల్ జిల్లా బంగారుపేటకు చెందిన కమలారావు శ్రీలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఇరు కటుంబాల పెద్దలు ఒప్పుకుని పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కమలారావు అసలు స్వరూపం బైటపడింది. 

పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు చేసే కమలారావు నిత్యం మధ్యం  సేవించేవాడు. ఇలా మధ్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ మధ్యకాలంలో ఆమెపై అనుమానం కూడా పెంచుకున్నాడు. ఇలా భర్త వేధింపులను తట్టుకోలేక పోయిన లక్ష్మి పలుమార్లు తండ్రి శ్రీనివాసవుకు తన ఆవేదనను తెలిపింది. దీంతో శ్రీనివాసరావు అల్లుడిపై కోపాన్ని పెంచుకున్నాడు.

ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కమలారావు భార్య  శ్రీలక్ష్మితో గొడవపడ్డాడు. దీంతో ఆమె తండ్రికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పింది. ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాసరావు అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కమల్‌రావు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కమలారావు మృతిచెందాడు. 

ఈ ఘటనపై కేసుమ నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.