రైల్లో తోటి ప్రయాణికులతో వాదనలకు దిగుతూ... అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తనను వారించాడనే కోపంతో.. ఓ వ్యక్తి.. హోంగార్డును కదులుతున్న రైలు లో నుంచి కిందకు తోసేశాడు. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోటనందూరు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రెడ్డి సూర్య వెంకట శివ(36) విధి నిర్వహణలో భాగంగా సామర్లకోటలో పని ముగించుకుని బొకారో ఎక్స్‌ప్రె్‌సలో తిరిగి వస్తున్నాడు. ఆ రైలులో ప్రయాణిస్తున్న హబీబ్‌ అనే ఉన్మాది తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని గమనించాడు. 

తుని సమీపంలో.. అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు శివతో ఉన్మాది వాగ్వాదానికి దిగాడు. తరువాత తనను అదుపు చేయాలని చూశాడనే కోపంతో.. శివను  కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. దీంతో శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే  మృతి చెందాడు.