వివాహేతర సంబంధాల వల్ల జీవితాలు నాశనమౌతున్నాయి. ఒకరితో బంధం కోసం.. మరొకరి ప్రాణాలను తీసేస్తున్న సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను పీక నులిమి చంపేశాడో కసాయి భర్త. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిడమర్రుకు చెందిన వీరవరపు అయ్యప్పకు 2016వ సంవత్సరంలో కొప్పర్రుకు చెందిన నాగవెంకట రమాదేవి(24)తో వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి. అయ్యప్ప వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని రమాదేవిని తరచు వేధించేవాడు. తన భార్య అడ్డుతొలగించుకుని ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకుడేవాడు. 

ఇదిగా ఉండగా జూలై 31వ తేదీన భార్యతో గొడవ పడి ఆమె పీక నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఫ్యాన్‌కు చీరతో కట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌, డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ హెచ్‌.నాగరాజు, సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు.