ఆనందకరమైన జీవితంలోకి అనుమానం అనే పెనుభూతం అడుగుపెట్టింది. ఆ అనుమానం అతనిలో రోజు రోజుకీ పెరిగిపోవడంతో...కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా కణేకల్లు ప్రాంతానికి చెందిన చిక్కనయ్య కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితను 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అనంతపురంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్ నగర్ లో స్థిరపడ్డాడు.

దంపతులకు సంతోష్, జాహ్నవి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి సంసారం సాఫీగానే కొంతకాలంపాటు సాగింది. ఇంతలోనే కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గతేడాది కరోనాతో పాఠశాలలు మూసి వేశారు. దీంతో.. కవిత పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది.

తరచూ భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో అతనిలో అనుమానం బాగా పెరిగిపోయింది. దీంతో.. ఈ విషయంలోనే  తాజాగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో చిక్కనయ్య.. భార్య కవిత మెడకు లుంగీ బిగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.