ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలోని  స్పందన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు అర్జీ కూడా పెట్టుకున్నారు. అధికారులు వచ్చి విచారణ కూడా చేశారు.

ఆస్తి గొడవల నేపథ్యంలో ఓ యువకుడు సొంత బాబాయి ని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆ హత్య తానే చేశానంటూ ధైర్యంగా చెప్పాడు. తాను మర్డర్ చేసి ఎక్కడికీ పారిపోలేదని.. ఆస్తి గొడవల వల్లే చంపేశానంటూ చెప్పడం గమనార్హం. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర ఈ హత్య జరిగింది. మృతుడు కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(48) గా గుర్తించారు. అదే గ్రామంలో ఉండే ఆయన రెండో అన్న వెంకట నారాయణ కుటుంబంతో వెంకటేశ్వరరావుకు ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలోని స్పందన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు అర్జీ కూడా పెట్టుకున్నారు. అధికారులు వచ్చి విచారణ కూడా చేశారు.

దీంతో.. బాబాయి వెంకటేశ్వరరావుపై పుల్లారావు ధ్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పీకలదాకా మద్యం తాగి.. ఆ సీసా పగలకొట్టి.. దానిని బాబాయి గొంతులో పొడిచి హత్య చేశాడు. తానే హత్య చేశానని అక్కడ ఉన్నవారందరికీ ధైర్యంగా చెప్పడం గమనార్హం. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.