అతను తల్లి లాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తి దగ్గరౌతుండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే పథకం ప్రకారం.... తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న వ్యక్తిని హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పెనుకొండ మండలంలోని మక్కాజిపల్లి సమీపంలో అక్కమ్మ గార్ల ఆలయం వద్ద ఈనెల 4న బయన్న(60) హత్య జరిగింది. మృతుడు బయన్న 9 నెలల నుంచి అక్కమ్మ గార్ల ఆలయానికి ప్రతి సోమవారం వచ్చి పూజలు నిర్వ హించేవాడు. మావటూరుకు చెందిన నరసింహమూర్తి ఉరుము వాయిద్యం వాయించడానికి వచ్చేవాడు.
 
  ఇతడితోపాటు భార్య చెన్నమ్మ, కుమార్తె నాగమణి, వరుసకు వదిన అయిన వివాహిత పూజలకు వచ్చేవారు. అయితే నిందితుడు నరసింహమూర్తి, గత కొంతకాలంగా వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రతి సోమవారం పూజల కోసం వచ్చే బయన్న మాయమాటలతో న రసింహమూర్తి వదినకు దగ్గరయ్యాడు.

అలాగే కు మార్తె కాపురం నాశనమవ్వడానికి బయన్నే కారణమని నిందితుడు కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో ఎ లాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ప్రత్యేక పూజలకోసం వచ్చిన బయన్నను నరసింహమూర్తి తొలుత కట్టితో కాళ్లను కొట్టడు. బోర్లా పడటంతో వెంట తెచ్చుకున్న కొడవలితో నరికినట్టు తెలిపాడు.

దర్యాప్తులో భాగంగా హరిపురం వద్ద శుక్రవారం నరసింహ మూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు గల కారణాలు వెల్లడించాడన్నారు. కేసు నమోదుచేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో వేగంగా పురోగతి సాధించిన సీఐ శ్రీహరి, ఎస్‌ఐ హారుణ్‌బాషా, నారాయణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.