గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్నేహితుడి కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే సత్యనారాయణ అనే వ్యక్తికి 40 సంవత్సరాలు.. ఇతనికి పెళ్లయినా, భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది.

దీంతో స్నేహితుడు కూతురైన జ్యోతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో జ్యోతి మరోకరితో సన్నిహితంగా ఉండటంతో సత్యనారాయణ ఆమెను అనుమానించాడు.  

వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. జ్యోతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో సత్యనారాయణ తట్టుకోలేకపోయాడు. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అక్కడికి వెళ్లి జ్యోతి గొంతు కోసి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.