కడప: కడప జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో మూడు నెలల తన కన్న బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని నదిలో పూడ్చేశాడు. 

కడప జిల్లా వేంపల్లెలో మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆదివారంనాడు వెలుగులోకి వచ్చింది. వేంపల్లే రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గజేంద్ర, కుర్షిదలకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. కుర్షిదకు ఇది రెండో వివాహం.

మూడు నెలల క్రితం కుర్షిదకు కూతురు జన్మించింది. అయితే, గజేంద్రకు భార్యపై అనుమానం పెనుభూతమైంది. దాంతో నిత్యం వేధిస్తూ వచ్చాడు. పాప తనకు పుట్టలేదంటూ భార్యతో పలుమార్లు గొడవ పడ్డాడు.

కాగా, ఈ నెల 3వ తేదీ సాయంత్రం పాపను తీసుకుని బైకుపై రౌండ్ వేసుకొస్తానని చెప్పి గజేంద్ర పాపాఘ్ని నదికి వెళ్లాడు. అక్కడ పాపను గొంతు నులిమి చంపి నదిలో పాతిపెట్టి పారిపోయాడు. 

భర్త తిరిగి రాకపోవడంతో భార్య కుర్షిద వెతుకింది. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.