ఫోన్ లో భార్య రాసలీలు.. ప్రియుడికి షాకిచ్చిన భర్త

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 21, Aug 2018, 1:02 PM IST
man killed wife's lover in vijayawada
Highlights

సాయిశ్రీనివాస్‌ తన భార్య ఫోన్ ని పరిశీలించగా.. వారి బాగోతం బయటపడింది. వారిద్దరి ఛాటింగ్ సంభాషణ, అసభ్యకరంగా దిగిన ఫోటోలు చూసి సాయి శ్రీనివాస్ రగిలిపోయాడు.

భర్తకు తెలియకుండా.. మరో వ్యక్తితో రాసలీలు చేస్తున్న భార్య, ఆమె ప్రియుడికి భర్త షాకిచ్చాడు. తన భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని.. ట్రాప్ లోకి లాగిన యువకుడిని అతి కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కృష్ణలంక బియ్యపుకొట్టు బజారుకు చెందిన లంకా నాగ వెంకట సీతారామాజంనేయశర్మ బాలాజీనగర్‌లో ఉన్న పాత ఆంజనేయస్వామి ఆలయం వద్ద పౌరోహిత్యం చేసేవాడు. అదే ఆలయానికి వెళ్తున్న మౌనిక అనే వివాహితకు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను పంపాడు. దీన్ని ఆమె ఓకే చేసింది. నాలుగేళ్ల క్రితమే మౌనిక తేలప్రోలుకు చెందిన కలతోటి సాయిశ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సీతామారాంజనేయతో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. ఇద్దరూ వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో చాటింగ్‌‌లు చేసుకో వడం, ఫొటోలను పోస్ట్‌ చేసుకోవడం మొదలు పెట్టారు. కాగా.. ఇటీవల  సాయిశ్రీనివాస్‌ తన భార్య ఫోన్ ని పరిశీలించగా.. వారి బాగోతం బయటపడింది. వారిద్దరి ఛాటింగ్ సంభాషణ, అసభ్యకరంగా దిగిన ఫోటోలు చూసి సాయి శ్రీనివాస్ రగిలిపోయాడు.

పథకం ప్రకారం.. సీతారామాంజనేయ శర్మని ఒకచోటుకు రప్పించి.. స్నేహితులతో కలిసి దారుణంగా కొట్టి చంపేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. శర్మ మృతదేహం లభించింది. దీనిపై విచారణ చేపట్టగా.. అసలు విషయం బట్టబయలు అయ్యింది. నిందితుడు సాయి శ్రీనివాస్ తోపాటు అతనికి సహకరించిన మిత్రులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 

loader