బ్లేడ్ బ్యాచ్ మధ్య ఘర్షణ.. చంపి రైల్వే యార్డ్‌లో పడేసిన ప్రత్యర్ధులు
విజయవాడ వించిపేట సమీపంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు మధ్య ఘర్షణ చెలరేగింది. వించిపేట- న్యూ రాజరాజేశ్వరి పేట మధ్యలో రైల్వే యార్డ్ సమీపంలో సూర్య అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య చేసిన తర్వాత శవాన్ని రైల్వే యార్డులో పడేశారు దుండగులు. మృతుడు సూర్య పలు కేసుల్లో నిందితుడిగా వున్నాడు.
విజయవాడ వించిపేట సమీపంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు మధ్య ఘర్షణ చెలరేగింది. వించిపేట- న్యూ రాజరాజేశ్వరి పేట మధ్యలో రైల్వే యార్డ్ సమీపంలో సూర్య అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.
హత్య చేసిన తర్వాత శవాన్ని రైల్వే యార్డులో పడేశారు దుండగులు. మృతుడు సూర్య పలు కేసుల్లో నిందితుడిగా వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే యార్డుకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన విరాలు తెలియాల్సి వుంది.