Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడిని చంపి ఇంట్లో పూడ్చి పెట్టాడు..

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఇంట్లో గొడవపడి తనింటికి వచ్చిన స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. ఆ తరువాత ఇంట్లోనే పూడ్చి పెట్టాడు. 

Man killed friend and buried him at home in kadapa - bsb
Author
First Published Jul 31, 2023, 12:22 PM IST

కడప : ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. నమ్మి వచ్చిన స్నేహితుడిని దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కడపలో వెలుగు చూసింది.  స్నేహితుడిని చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు కిషోర్ అనే వ్యక్తి. ఇంట్లో గొడవపడిన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి స్నేహితుడైన కిషోర్ దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. సతీష్ ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

నెలరోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. స్నేహితుడిని చంపి ఇంట్లోనే ఇసుకలో పూడ్చిపెట్టాడు స్నేహితుడు. తల్లితో గొడవపడి స్నేహితుడిైన కిషోర్ ఇంటికి వెళ్లాడు సతీష్. అయితే, నెలరోజులవుతున్నా కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కిషోర్ తల్లి సతీష్ ఇంటికి వచ్చింది. తన కొడుకు ఎక్కడ అని ప్రశ్నించగా కిషోర్ ఏమీ సమాధానం చెప్పలేదు. ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుండడంతో కిషోర్ ను గట్టిగా నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios