ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, దారుణంగా హతమార్చారు. భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 

అనంతపురం : Inter-caste marriage నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. Sri Sathya Sai District కనగానపల్లికి చెందిన ముత్యాలమ్మ, నాగన్న దంపతులకు చిట్ర మురళి (27) ఒక్కగానొక్క సంతానం. ఇతను పీజీ పూర్తి చేసి, పెనుగొండ వద్ద ఉన్న Kia Car Companyలో ఉద్యోగంలో చేరాడు. అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసింది. మూడేళ్ల కిందట గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం పొంది, ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తోంది. మురళి, వీణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిరుడు జూన్ లో వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో... మురళి కియా పరిశ్రమకు వెళ్లడానికి గురువారం సాయంత్రం రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సుకోసం వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని బలవంతంగా తీసుకు వెళ్లారు. విధుల నుంచి ఇంటికి వచ్చిన వీణ భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ స్విచాఫ్ రావడంతో మిత్రులు, కుటుంబ సభ్యులను ఆరా తీసింది. ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, శుక్రవారం రాప్తాడు మండలం లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా గొంతుకోసి హతమార్చినట్లు గుర్తించారు. కిడ్నాప్ కు గురైన మురళి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. తమ ప్రేమ వివాహం ఇష్టం లేకనే తన తల్లి భర్తను హత్య చేయించి ఉంటుందని వీణ రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవ రెడ్డి తెలిపారు.

ఇలాంటి ఘటనే జూన్ 14న తమిళనాడులో చోటు చేసుకుంది. tamil naduలోని కుంభకోణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన newly marriedను ఆమె సోదరుడు feast ఏర్పాటు చేసి, ఇంటికి పిలిచాడు. విందుకు వచ్చిన ఆమెను, ఆమె భర్తను కర్కశంగా murder చేశాడు. ఈ షాకింగ్ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెడితే.. నర్సుగా పనిచేస్తున్న 23 ఏళ్ల శరణ్యకు ఐదు రోజుల క్రితం మోహన్‌తో వివాహమైంది. పెళ్లికి ముందు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకోవాల్సి రావడంతో దంపతులు సోమవారం వారి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే శరణ్య సోదరుడు శక్తివేల్ దంపతులను తన ఇంటికి విందుకు పిలిచాడు. విందు అనంతరం దంపతులు బయలుదేరడానికి సిద్ధం అవుతుండడంతో.. శక్తివేల్‌, అతని బావ రంజిత్‌లు కొడవళ్లు తీసి మోహన్‌ను నరికి చంపారు. అది చూసి షాక్ అయిన శరణ్య తేరుకుని సహాయం కోసం అరిచేలోపే ఆమె మీద కూడా దాడి చేశారు. ఆమెను నరికి చంపేశారు. 

అనంతరం శక్తివేల్‌, రంజిత్‌లు కుంభకోణం టౌన్‌ పోలీసులకు లొంగిపోయారు. తన బావమరిది రంజిత్‌తో శరణ్య పెళ్లి చేయాలని శక్తివేల్ యోచిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే అతని ఇష్టం లేకుండా శరణ్య మోహన్‌ని పెళ్లి చేసుకుందని.. దీంతో ఆగ్రహించిన శక్తివేల్.. నమ్మించి హత్యలు చేశాడని తేలింది. మోహన్, శరణ్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.