బైకులో తిరుమలకు మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఓ యువకుడిని అలిపిరి చెక్ పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 

తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మద్యం దొరికింది. తిరుపతి నుంచి తిరుమలకు బైక్‌లో మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తరలిస్తున్న వ్యక్తి జీవకోనకు చెందిన చంటిగా గుర్తించారు. అతని నుంచి 14 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న చంటిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు అప్పగించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred