సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని నిర్వహించిన కోడి పందేల్లో ఓ వ్యక్తికి కోడి కత్తి తగిలి మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం సమీపంలోని పామాయిల్ తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలలో బాగంగా కోడి కాళ్లకు కత్తులు కడుతున్నారు. పందేలను చూసేందుకు  సరిపల్లి వెంకటేశ్వరరావు(55) అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

Also Read అమరావతి: విశాఖకు రాజధాని తరలించొద్దంటూ సీఆర్‌డీఏకు రైతుల అభ్యంతరాలు...

ఈ క్రమంలో కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదల్చడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడ భాగంలో కత్తి గుచ్చుకుంది. బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు.అక్కడున్నవారు వెంటనే స్పందించి వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరాను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో.. ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.