వినాయకమండపంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి..
వినాయకమండపంలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది.

శ్రీసత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండెపోటు నేటి యువత పాలిట పెను శాపంగా మారింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నవారిని ఉన్నపాటున బలితీసుకుంటుంది. అలాంటి ఘటనే ఇది. వినాయకనవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపంలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు అలాగే కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.