ఏపీ బంద్‌లో విషాదం.. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తోపులాటలో ఓ వ్యక్తి మరణం

man died in AP Bandh
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రబంద్‌లో విషాదం చోటు చేసుకుంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రబంద్‌లో విషాదం చోటు చేసుకుంది. బంద్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ర్యాలీ నిరసన నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు..

వారిని పీఎస్‌కు తరలించే క్రమంలో తోపులాట జరగింది. ఈ ఘటనలో దుర్గారావు అనే కార్యకర్త గుండెపోటుకు గురై మరణించాడు. కార్యకర్త మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. దుర్గారావు కుటుంబానికి సానుభూతి తెలిపారు.
 

loader