కుందేళ్ల వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తుపాకీ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏలూరు జిల్లా తీగలపల్లెలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఇంటికి చేర్చి అతని మిత్రులు పారిపోయారు. 

ఏలూరు జిల్లాలో (eluru district) నాటు తుపాకీ పేలి ఒకరు చనిపోయారు. తీగలపల్లెకి చెందిన ముగ్గురు యువకులు రాత్రి తుపాకీతో కుందేళ్ల వేటకు వెళ్లారు. మట్టి రోడ్డులో వెళ్తూ వుండగా.. తుపాకీ కిందపడి పేలింది. ఈ క్రమంలో బుల్లెట్ కృష్ణ అనే వ్యక్తి తలలోకి దూసుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఇంటి వద్దకు చేర్చిన మరో ఇద్దరు యువకులు పరారీలో వున్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred