గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్‌లో అప్పులపాలైన ఇద్దరు యువకులు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వీరిలో ఇప్పటికే సురేశ్ అనే వ్యక్తి మరణించగా, తాజాగా కొమురయ్య అనే మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెట్టింగ్ కారణంగానే బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు. చనిపోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

క్రికెట్ బెట్టింగ్ లో రూ. లక్షల్లో నష్టపోయామని.. డబ్బులు చెల్లించాలని బుకీల నుంచి ఒత్తిడి వచ్చిందని.. చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగుతున్నామంటూ సెల్ఫీ వీడియోను తీశారు. ఆ వీడియోను బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించారు.

వెంటనే అక్కడికి వెళ్లిన బంధువులు ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి.. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్ చనిపోగా.. కొమరయ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.