భార్య తిట్టిందని ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన పి.గన్నవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... పి.గన్నవరం శివారు చింతపల్లివారి పేటకు చెందిన పల్లి సత్యానారాయణ(56) గురువారం రాత్రి పరుగుల మందు తాగాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ... కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

అయితే... సత్యనారాయణ  నిత్యం మద్యం సేవిస్తూ.... ఇంట్లోకి కనీసం ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలో.... మద్యం తాగి వచ్చి విసిగిస్తున్నాడని భార్య మందలించింది. దీంతో మనస్థాపానికి గురై అతను పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.