భార్య, పిల్లలకన్నా కూడా.. తాను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకే ఎక్కువ విలువ ఇచ్చాడు. కట్టుకున్న భార్య నగలన్నీ తీసుకువెళ్లి ఆమె ముంగిట గుమ్మరించాడు. కానీ చివరకు ఆమె అతనికి వెన్ను పోటు పొడిచింది.  అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. పోలీసులు కూడా ఆమె చెప్పిందే నమ్మారు.

 అతనిని ఘోరంగా అవమానించారు. ఈ అవమానాన్ని భరించలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతను ఆత్మహత్య చేసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ.. ఈ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా చీరాల సీతమ్మవారి తోటకు చెందిన అంబటి రవీంద్రబాబు(35) ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య బంగారం తీసుకువెళ్లి ఆమెకు ఇచ్చాడు. తర్వాత వాటిని తీసుకోవాలని భావించిన రవీంద్రబాబు.. ఆ నగలు తిరిగి ఇవ్వమని కోరాడు. అందుకే వ్యతిరేకించిన ప్రియురాలు.. తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది.

ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ పేరిట పిలిచి ఓ సీఐ అవమానించాడు. మహిళ దగ్గర డబ్బులు తీసుకొని సీఐ తనను.. వేధించాడంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియోలో రవీంద్రబాబు పేర్కొన్నాడు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని అతను సీఎం ని కోరడం గమనార్హం.

అయితే.. ఆ బంగారు నగలను రవీంద్రబాబుకి అప్పగించామని.. అతనిని సీఐ ఎక్కడా కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రియురాలు కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.