అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేసిన ఓ కేటుగాడు.. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన బి.హేమంత్ కుమార్‌కు స్థానిక జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న కిరాణాషాపుకు వచ్చే 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అక్కడితో ఆగిపోకుండా ఆమె చెల్లెలితో కూడా ఇదే రకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు.

ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న సదరు యువతులను తన విషయం బయటపెడితే మీ న్యూడ్ ఫోటోలను నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు.

అంతేకాకుండా వాటని తన స్నేహితులకు చూపించాడు. అతని వేధింపులు మితిమీరిపోవడంతో మైనర్ బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని హెచ్చరించింది. దీంతో హేమంత్ కుమార్ తన స్నేహితులతో కలిసి ఆమెపై బ్లేడ్‌తో దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కుమార్‌తో పాటు అతని స్నేహితులు అనిరుధ్ రెడ్డి, ప్రశాంత్‌లతో పాటు ఇద్దరు యువతులపైనా కేసులు నమోదు చేశారు.