బెజవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంటర్ విద్యార్ధినిపై కత్తితో దాడి

బెజవాడలో (vijayawada) దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై (inter student) ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. ఆదివారం భారతి నగర్‌లోని (bharathi nagar) యువతి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి మెడ, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. 

man attack on young woman in vijayawada

బెజవాడలో (vijayawada) దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై (inter student) ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. ఆదివారం భారతి నగర్‌లోని (bharathi nagar) యువతి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి మెడ, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరుపులు, కేకలతో వెంటనే స్పందించిన స్థానికులు యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువకుడు పరారీలో వుండటంతో అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios