అదృశ్యమైన వ్యక్తి హతమైనట్లు ఐదు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (25) గత ఏడాది జూలై 13న హతమైనట్లు పోలీసులు నిర్ధారించారు. నడుపూరు సమీప రామచంద్రనగర్‌కు చెందిన సానా వాసు(38), పుచ్చా వంశీ (20), కొవ్వూరు సందీప్ రెడ్డి(20) అనే ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారని పోలీసులు తేల్చారు. ఆ నిందుతులను అనకాపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
వివాహితతో అదృశ్యమైన ఓ యువకుడు ఐదు నెలల కిందటనే హతమైనట్లు వెలుగులోకి వచ్చింది. సుమారు 5 నెలల కిందట కనిపించకుండా వెళ్లిపోయిన పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (25) గత ఏడాది జూలై 13న హతమైనట్లు పోలీసులు నిర్ధారించారు. నడుపూరు సమీప రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన పుచ్చా వంశీ(20), కొవురు సందీప్‌రెడ్డి(20) అనే ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారని పోలీసులు తేల్చారు. ఆ నిందుతులను అనకాపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
కేసు వివరాలిలా ..
పరవాడ మండలంలోని వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (25)కు ఓ యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అఖిలేష్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ గాజువాక సమీపంలోని నడుపూరు దరి రామచంద్రనగర్‌లో తన భార్య, పిల్లలతో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో భార్య డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు అయినా సంతోషి అనే వివాహితతో అఖిలేష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. వివాహేతర సంబంధంగా మారింది.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2021 మార్చిలో అఖిలేష్ ఆమెను, ఇద్దరు పిల్లలను తీసుకుని పద్మనాభం వెళ్లిపోయాడు. ఈ మేరకు వివాహిత కుటుంబసభ్యులు మల్కాపురం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10రోజుల తర్వాత పోలీసులు వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి మహిళను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సంతోషి బావ రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు పుచ్చా వంశీ (20), కొవురు సందీప్‌రెడ్డి (20) కలిసి అఖిలేష్‌ను పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వాతి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఎంత చెప్పిన అఖిలేష్ బుద్ది మారలేదు. 2021 జూన్‌లో అఖిలేష్ మరోసారి ఆమెను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. గతంలో వారిద్దరు వెళ్లినప్పడూ పద్మనాభం గ్రామంలో ఉన్నారు. ఇప్పుడూ కూడా అదే గ్రామంలోనే ఉండవచ్చనని సానా వాసు, పుచ్చా వంశీ, కొవ్వూరు సందీప్‌రెడ్డి భావించారు. అక్కడికి వెళ్లి ఆచూకీ తీశారు. ఈ క్రమంలో గతేడాది జులై 13న పద్మనాభంలోని అద్దె ఇంట్లో ఉన్న సామాన్ల కోసం అఖిలేష్ వచ్చాడని తెలుసుకుని ముగ్గురు అక్కడికి చేరుకున్నారు.
సంతోషి ఎక్కడుందని అఖిలేష్‌ను ప్రశ్నించగా .. తనకు తెలియదని అఖిలేష్ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ.. బయట మాట్లాడుకుందామని చెప్పి అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో అఖిలేష్‌ను వాసు తన ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరాడు. మరో ద్విచక్ర వాహనంపై వంశీ, సందీప్‌రెడ్డి బయలుదేరారు. వారి ప్లాన్ ప్రకారం..ఆనందపురం మండలం నీలకుండీల కూడలి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అఖిలేష్‌పై కర్రలు, రాళ్లలో క్రూరంగా దాడి చేశారు. బండరాయితో ముఖం మీద మోది గుర్తు పట్టలేని విధంగా చేశారు. అనంతరం మెడకు షర్టును గట్టిగా బిగించి చంపేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డాగ్ స్క్వాడ్ పసిగట్టకుండా ఉండేందుకు మృతుని శరీరంపై, పరిసర ప్రాంతాల్లో కారంతోపాటు వెల్లుల్లి పేస్టును చల్లారు. శవాన్ని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు.
తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ క్రమంలో అఖిలేష్ తండ్రి వియ్యపు ముత్యాలనాయుడు.. తన కుమారుడు జూన్ నుంచి కనిపించడం లేదని 2021 సెప్టెంబరు, 19న పరవాడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సంతోషి లక్ష్మి బంధువులపై నిఘా ఉంచి కాల్ డేటా పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సనా వాసు, పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని హత్యా స్థలికి తీసుకెళ్లగా... అక్కడ మృతుని ప్యాంటు, పుర్రె, ఎముకలు లభించాయి. నిందితులను రిమాండ్‌కు తరలించారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసును సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ పి.రమేష్ ఛేదించారు.
