కడప: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కడప తాలుకా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన దివి హరీష్‌ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వైఎస్‌ షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఐపీ అడ్రస్‌ ఆధారంగా హరీష్‌ చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా బొమ్మనంపాడుకు చెందిన హరీష్‌పై 354ఏ, 509, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.