దురాశ.. బ్లేడ్ తో తనను తానే కోసుకుని.. దొంగల దాడి అని నాటకం..

అలా సెప్టెంబర్ 29న చిలకలూరిపేట లోని  రైస్ మిల్లు యజమాని అలీ దగ్గర  రూ.1.30 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును చూసిన కనకయ్యకు దుర్బుద్ధి పుట్టింది.  ఎలాగైనా ఆ నగదును కూడా చేయాలనే దురాలోచన చేశాడు.

man arrested for cheating owner in guntur

గుంటూరు : బ్లేడ్ తో (Blade)తనకు తానే కోసుకుని దోపిడి దొంగలు (Looters)దాడిచేసి నగదు దోచుకున్నట్లు ఫిర్యాదు చేసి పోలీసులను తప్పు దోవ పట్టించే యత్నం చేసిన ఘనుడిని  గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీసు కార్యాలయంలో నిందితుడు వివరాలను అర్బన్ ఎస్పీ ఆరిఫా హఫీజ్ తెలిపారు. 

కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన గొరికపూడి కనకయ్య అదే గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి వెంకటేశ్వరరావు వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు.  కనకయ్య తన యజమాని చెప్పిన గ్రామాలకు వెళ్లి అక్కడి రైస్ మిల్లు వ్యాపారుల నుంచి ధాన్యానికి సంబంధించిన నగదు వసూలు చేసి తెచ్చి ఇస్తూ ఉండేవాడు. 

అలా సెప్టెంబర్ 29న చిలకలూరిపేట లోని  రైస్ మిల్లు యజమాని అలీ దగ్గర  రూ.1.30 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును చూసిన కనకయ్యకు దుర్బుద్ధి పుట్టింది.  ఎలాగైనా ఆ నగదును కూడా చేయాలనే దురాలోచన చేశాడు.

తక్కెళ్ళపాడు రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే తన వద్ద ఉన్న గోతాలు కోసే ఫోల్డింగ్ బ్లేడుతో తన చొక్కా, లోపలి బనియను కోసుకున్నాడు. తనవద్ద ఉన్న నగదును  కుమారుడిని పిలిచి ఇచ్చి పంపించేశాడు.

ఆ తర్వాత పెదకాకాని పోలీస్ స్టేషన్కు వెళ్లి తనను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి తన వద్ద ఉన్న రూ.1.30 లక్షలు దోచుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. దీనిపై డీఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.  ఏఎస్పీ గంగాధరం, మంగళగిరి డిఎస్పి రాంబాబు ఆధ్వర్యంలో  పెదకాకాని  సిఐ బి సురేష్ బాబు,  మంగళగిరి  సిఐ బి. అంకమ్మరావు లు  దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదును విచారించే క్రమంలో నిందితులు ముఖాలకు మాస్కులు వేసుకుని ఉన్నారని,  కత్తితో పొడిచారని చెప్పడం,  చొక్కా, బనియన్ చిరిగిన తీరుతో పోలీసులకు అనుమానం వచ్చింది.

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ.. అక్టోబర్ 7కి వాయిదా

పోలీసులు తమదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేస్తే  తానే ఆ నగదును దోచికున్నట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.  దీంతో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు యజమానికి నమ్మకద్రోహం చేసినందుకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆరు గంటల్లోనే కేసును ఛేదించిన సిఐలతో పాటు ఎస్ఐ వినోద్ కుమార్,  సిబ్బంది రాజేంద్ర బాబు,  ప్రసాద్ బాబు, శ్రీనివాస రావు,  నాయక్,  శ్యాంసంగ్, సుధాకర్,  వెంకటేశ్వరరావులను అభినందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios