Asianet News TeluguAsianet News Telugu

సహోద్యోగితో ప్రేమ, బంధువుల అమ్మాయితో పెళ్లి.. నగదు, బంగారు కాజేసి.. దారుణం...

ప్రేమించిన వ్యక్తి కోసం  రాష్ట్రాలు దాటి వచ్చిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను నిర్బంధించి, బెదిరింపులకు గురి చేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజులపాటు తీవ్ర మనోవేదనకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం…

man and his family members kidnapped lover in veeravasaram - bsb
Author
Hyderabad, First Published Jul 7, 2021, 11:10 AM IST

ప్రేమించిన వ్యక్తి కోసం  రాష్ట్రాలు దాటి వచ్చిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను నిర్బంధించి, బెదిరింపులకు గురి చేస్తారని ఊహించని ఆ యువతి రెండు రోజులపాటు తీవ్ర మనోవేదనకు గురైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం…

పశ్చిమగోదావరి జిల్లా, వీరవాసరం మండలం కు చెందిన ఎ. రమేష్ బెంగళూరుకు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నారు.  అయితే రెండేళ్ల కిందట.. స్వగ్రామానికి వచ్చిన రమేష్ వచ్చిన రమేష్ యువతికి తెలియకుండా దగ్గరి బంధువుల కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు.

ఆ తరువాత ఈ విషయం తెలియడంతో ఆ యువతి రమేష్ ను దూరం పెట్టింది. అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారంటూ మాయమాటలు చెప్పి రమేష్ ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే విడతలవారీగా రమేష్ కు రూ.50 లక్షల నగదు, బంగారం ఇచ్చినట్లు ఆ యువతి చెబుతోంది. 

కరోనా నేపథ్యంలో నిరుడు స్వగ్రామానికి వచ్చిన రమేష్ అప్పటి నుంచి ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడని, కొద్దిరోజులుగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఈ నెల 3న నవుడూరు లోని రమేష్ ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అయితే విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి, బెదిరించడంతో దిక్కు దిక్కు తోచని స్థితిలో నవుడూరు బస్టాండ్ వద్ద కూర్చుని ఏడుస్తుండగా స్థానికులు గమనించారు. 

ఈ విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని భావించిన రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు మాయమాటలు చెప్పి పెనుమంట్ర మండలం కొలనూరు శివారులో ఒక ఇంటికి తీసుకెళ్ళి నిర్బంధించారు. ఈ సమాచారం ఎలాగో పోలీసులకు చేరడంతో ఎస్ఐ ఎ. పైడి బాబు రంగంలోకి దిగారు. 

మంగళవారం ఆ ఇంటికి వెళ్లి యువతిని విడిపించి వీరవాసరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతనికి సహకరించిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios