విశాఖనగర పరిధిలోని విశాఖ స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీఎస్ఈజడ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూజా స్క్రాప్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

"

కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలో మంటలు వ్యాపించినట్లు యాజమాన్యం తెలిపింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.

ఏసీపీ శ్రీపాదరావు, సీఐ లక్ష్మి లు ఘటనా స్థలిని పరిశీలించారు. సుమారు రూ. కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు పరిశ్రమ ఇన్ ఛార్జ్ భాను ప్రకాశ్ తెలిపారు.