పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌తో అమరావతి మేజర్ కెనాల్ వద్ద పక్కకు ఒరిగింది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం పిడుగురాళ్ల నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్ స్పీడ్‌తో అమరావతి మేజర్ కెనాల్ వద్ద పక్కకు ఒరిగింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా గుంటూరు -మాచర్ల ప్రధాన రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. డ్రైవర్లు అతివేగంతో బస్సులు నడుపుతున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred