హైదరాబాద్:  ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేపుల వివాదం నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి సినీనటుడు పృథ్వీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ క్రిటిక్ మహేష్ కత్తి పృథ్వీ చర్యను సమర్థించారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. దానికి విపరీతమైన స్పందన వస్తోంది.

మహేష్ కత్తి పోస్టును నెటిజన్లు షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. దానిపై కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది మహేష్ కత్తి పోస్టును షేర్ చేయగా 713 మంది లైక్ చేశారు. దానిపై పేస్ బుక్ లో వేడివేడిగా చర్చ సాగుతోంది.

Also Read: ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

మహేష్ కత్తి తన పోస్టులో...."పృథ్విరాజ్ ఆడియో టేప్ లీక్ ఇప్పుడే విన్నాను. అది అతని గొంతా కాదా అనేది పక్కనపెడితే,ఆ అమ్మాయికూడా ఇంట్రస్టు ఉన్నట్టే మాట్లాడింది. ప్రోత్సహించింది. అంటే "మ్యూచ్యువల్ కన్సెన్ట్" అనే అర్థం అవుతోంది" అని అన్నారు.

"మరి ఇక సమస్య ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవాళ్ళు ఎవరూ ప్రేమించుకోకూడదా? సంసారాలు చెయ్యకూడదా? సెక్స్ చాట్, టాక్ నిషిద్దమా?" అని కూడా మహేష్ కత్తి అన్నారు.

Also Read: వాయిస్ మార్ఫింగ్ చేశారు, మళ్లీ వస్తా: పృథ్వీరాజ్