నూతన దళిత నాయకత్వం కోసం తాను జిల్లాల పర్యటనలను చేస్తున్నట్లు మహేష్ కత్తి చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, దళిత హక్కులను పరిరక్షించే పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు
ఒంగోలు: సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఆసక్తికరమైన విషయం చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
రాజకీయ పార్టీలు దళిత జాతికి అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నూతన దళిత నాయకత్వం కోసం తాను జిల్లాల పర్యటనలను చేస్తున్నట్లు మహేష్ కత్తి చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, దళిత హక్కులను పరిరక్షించే పార్టీకి మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు
రాజకీయ నేతలు పరిణతి సాధించి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి విషయంలోనూ వెనుకడుగు వేయడం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అలవాటు అని ఆయన అన్నారు.
ఇటీవల జరిగినవి పరువు హత్యలు కావని, కుల ఉన్మాద హత్యలని కత్తి మహేష్ అన్నారు. మిర్యాలగుడాలో ప్రణయ్ విగ్రహం స్థాపించాలని ఆయన డిమాండ్ చేశారు.
