రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారుకి  శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. కాగా.. ఆమెను  చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.