విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీ నేత మాగంటి బాబు తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఇష్టం లేకపోతే మన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కదా అందరం తెలంగాణ వెళ్లిపోదామని ఆయన అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 45 రోజుల స్థాయికి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేన ని ఆయన అన్నారు.

ఎక్కడైనా ప్రభుత్వ పాలనపై మూడు, నాలుగు ఏళ్ల తరువాత వ్యతిరేకత వస్తుందని, జగన్ పాలన చేపట్టిన దగ్గరనుండి వ్యతిరేక వచ్చిందని ఆయన అన్నారు. పాలన మొత్తం రివర్స్ లోనే సాగుతోందని మాగంటి బాబు అన్నారు. ఎన్నో అద్భుతాలు చేస్తారని ప్రజలు జగన్ ను గెలిపించారుని, ఒక్క చాన్స్ అని ప్రజల జీవితాలతో అడుకుంటున్నారని ఆయన అన్నారు. రైతులు పార్టీని చూసి భూములు ఇవ్వలేదని, టీడీపీకి భూములు ఇచ్చి ఉంటే,శ్రావణ్ కుమార్ ఓడిపోయేవాడు కాదని,మంగళగిరిలో లోకేష్ ఓడిపోయేవాడు కాదని ఆయన అన్నారు.

ఇక్కడ అన్ని పార్టీల వారు ఉద్యమం చేస్తున్నారని అంటే ఆ ఘనత ముఖ్యమంత్రిదేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపారు.వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి. శ్రీదేవి కోసం వైసీపీ రైతులు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టినవారు ఈ రోజు ఉద్యమంలో కూర్చున్నారని ఆయన అన్నారు. 
"
నేను ఒక్కటే ఘంటా పదంగా ముఖ్యమంత్రి కి చెప్తున్నాను. నా కన్నా చాలా చిన్న వయస్సు నీది మాట తప్పను మడెం తిప్పను అన్నారు ఏసీ రూములో కూర్చుని కమిటీలు వెయ్యడం కాదు అమరావతి రైతులపైన ఒక్క కమిటీ అయినా వేశారా..వారితో ముఖాముఖి గా మాట్లాడారా ..?" అని మాగంటి బాబు అన్నారు. 

జియన్ రావు,బోస్టన్, హైపవర్ కమిటీలు ఏసీ రూములకే పరిమితయ్యాయని,రైతుల సమస్యలు, బాధలు ఏమిటి అని ఒక్కరైనా అడిగి తెలుసుకున్నారా..? అని ఆయన అన్నారు. తాను వైస్సార్ హయాంలో మంత్రిగా చేశానని, ఇప్పుడు టీడీపీలో వున్నానని, అంటే  దానికి కారణం జగన్ అని ఆయన అన్నారు. కేవలం ఒక్క జడ్పీటీసీ స్థానంలో ఓటమి కారణముగా తనను మంత్రి పదవి నుండి తొలగించారని ఆయన అన్నారు. 

పార్టీ ఏదైనా పదవి, స్థాయి వున్నా గొప్పకాదని,  ఇక్కడ తమ తాతల కాలం 100 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళమని ఆయన అన్నారు.  "ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గా ఉండొచ్చు-రేపు మరొకరు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. అన్ని మతాల,కులాల వారు ఇక్కడ వున్నారు. బైబిల్, ఖురాన్, భగవత్ గీతలని గౌరవిస్తాం  ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు చేసిన ద్రోహం అంతా..ఇంతా కాదుమీ సొంత సర్వేలోనే 75% శాతం వ్యతిరేకత వచ్చింది" అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యంలో  తమ భావాలు తెలుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ఇక్కడి రైతులు గొంతు నొక్కేస్తున్నారని, పోలీసుల చేత లాఠీ ఛార్జ్ చేయిస్తున్నారని, ఇన్ని రోజులుగా ఇక్కడి రైతులు దీక్షలు చెస్తున్నారంటే-వారిలో దీక్షలో న్యాయం ఉందని ఆయన అన్నారు. టీడీపీ పై కూడా వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. నిన్న రాయలసీమ లో బాలకృష్ణ ని అడ్డుకున్నారని, వైజాగ్ లో టీడీపీ కార్యాలయం ముట్టడించారని, ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. 

ఏది అనుకుంటే అది చెయ్యడం, జీవో లు జారీ చెయ్యడం పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. వైస్సార్ శాసన మండలి పెట్టింది ఎందుకు...? పెద్దల సభకు విలువలు ఉంటాయి కనుక అని ఆయన అన్నారు.