Asianet News TeluguAsianet News Telugu

గతం గుర్తొచ్చింది.. 20 నెలల తరువాత అడ్రస్ చెప్పిన పేషంట్..

అచ్చం సినిమాను తలపించే సంఘటన ఒకటి విశాఖపట్నం మానసిక ఆస్పత్రిలో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. 

Madyapradesh Patient Discharge From Psychiatric Hospital After 20 Months - bsb
Author
hyderabad, First Published Nov 9, 2020, 10:01 AM IST

అచ్చం సినిమాను తలపించే సంఘటన ఒకటి విశాఖపట్నం మానసిక ఆస్పత్రిలో జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. 

మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్‌(22) చినవాల్తేరులో రోడ్డు పక్కన ఉండడంతో గమనించిన ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డాక్టర్‌ ప్రొఫెసర్‌ రామానంద శతపతి గమనించారు. తన సహచరునితో కలిసి కారులో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

దీనికోసం జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సాయంతో రిసెప్షన్‌ ఆర్డర్‌ తేవడంతో పోలీసులు కూడా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగి కోలుకోవడంతో తన వివరాలు తెలియజేశాడు. అతనికి గతం మర్చిపోయి 20 నెలలు అవుతోందని అప్పుడే తెలిసింది.

ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్‌ డీజీపీని సంప్రదించడంతో కుమార్‌ డిశ్చార్జికి మార్గం సుగమమైంది. ఆస్పత్రి చిరునామా కోసం కుమార్‌ కుటుంబీకులు ఆస్పత్రి డాక్టర్‌ని ఆదివారం సంప్రదించారు. అతని కుటుంబ సభ్యులు సోమవారం మానసిక ఆస్పత్రికి రానున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios