మాడుగుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ బలంగా వున్నాయి.  దీంతో మాడుగుల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బూడి ముత్యాల నాయుడిని కాదని వైసిపి మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. టీడీపీ కూడా కొత్త అభ్యర్థిని మాడుగుల పోటీలో నిలిపింది. ఇలా రెండుపార్టీలు మాడుగులలో అభ్యర్థులను మార్చి ప్రయోగం చేయడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.   

Madugula assembly elections result 2024 RMA

మాడుగుల నియోజకవర్గ రాజకీయాలు :

 ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో మాడుగుల ఒకటి. ఇక్కడ 1983 నుండి 2004 వరకు టిడిపి ఓటమన్నదే ఎరగదు. వరుసగా ఐదుసార్లు (1983, 1985, 1989, 1994, 1999) మాడుగల ఎమ్మెల్యేగా పనిచేసారు రెడ్డి సత్యనారాయణ.  ఆ తర్వాత 2009 లో గవిరెడ్డి రామానాయుడు టిడిపి నుండి పోటీచేసి  గెలిచారు.   

ఇక మాడుగులలో వైసిపి కూడా బలంగానే వుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండుసార్లు వైసిపి గెలిచింది.  బూడి ముత్యాలనాయుడు 2014, 2019 ఎన్నికల్లో వైసిపి నుండి పోటీచేసి గెలిచారు. 
 
మాడుగుల నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. చీడికాడ
2. దేవరపల్లి
3.  కె. కోటపాడు
4.  మాడుగుల 

మాడుగుల అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,15,571
పురుషులు -    1,04,981
మహిళలు ‌-    1,10,584

మాడుగుల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఈసారి మాడుగులకు దూరమయ్యారు. ఆయనను అనకాపల్లి లోక్ సభకు షిప్ట్ చేసింది వైసిపి అధిష్టానం. దీంతో మాడుగుల అసెంబ్లీలో ఎర్లీ అనురాధ పోటీ చేస్తున్నారు.   

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ కూడా మాడుగుల బరిలో కొత్త అభ్యర్థిని నిలిపింది. గత ఎన్నికల్లో పోటీచేసిన గవిరెడ్డి రామానాయుడికి కాకుండా ప్యాల ప్రసాదరావుకు మాడుగుల సీటు కేటాయించింది. 

మాడుగుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

మాడుగుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి 91,869 ఓట్లతో విజయం సాధించారు
 

మాడుగుల అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,54,609  

వైసిపి - బూడి ముత్యాల నాయుడు - 78,830 ఓట్లు (50 శాతం) - 16,396 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - గవిరెడ్డి రామానాయుడు - 62,438 ఓట్లు (40 శాతం) - ఓటమి
 
మాడుగుల అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,47,160 ఓట్లు (84 శాతం)

వైసిపి - బూడి ముత్యాలనాయుడు - 72,299 (49 శాతం) - 4,761 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - గవిరెడ్డి రామానాయుడు  - 67,538 (45 శాతం) - ఓటమి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios